సౌందర్యలహరి
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
నీపదరేణువుం బడసి నీరజగర్భుడు సృష్టికర్తయౌ,
నీపదరేణువుం దలలనిల్పును వేయిట విష్ణువాదటన్,
నీపదరేణువున్మెదిపి నేరుపునన్ హరుడంగరాగసం
దీపనసిద్ధినొందు జననీ! నిను వర్ణనసేయనేర్తునే?........2
నీపదరేణువుం దలలనిల్పును వేయిట విష్ణువాదటన్,
నీపదరేణువున్మెదిపి నేరుపునన్ హరుడంగరాగసం
దీపనసిద్ధినొందు జననీ! నిను వర్ణనసేయనేర్తునే?........2
తాతగారి కవితాధార విశిష్టమైనది. ఎక్కడా అనువాదచ్ఛాయలు లేకుండా స్వతంత్రపద్యాలవలె భాసిస్తున్నాయి. వారికి నా నమోవాకాలు.
ReplyDeleteనమస్కారములు ఆచార్యవర్యా!!! ధన్యోస్మి!!!
ReplyDeleteVery Good .. All the Best Sir
Deletedhanyosmi!!!
Deleteచాలాకాలంక్రితమే ఆదునిక భావజాలన్ని, ఆధునిక భాషా ప్రయోగాన్నీ కలిగిన శ్రీ శేషగిరిరావు పంతులుగారి ని గూర్చి సమగ్రముగా తెలుసుకోవటానికి బ్లాగు ను తయారుచేయటము ముదావహము. దీనికై వారి మనుమడు శ్రీ విద్యసాగరులవారు అభినందనీయులు. విద్యాసాగరులవారు ,పద్యసాగరములో సదా నౌకావిహారాన్ని సలుపువారు. వారెన్నో ఫేస్ బుక్ గ్రూపులను పద్యవిహారానికై తయారు చేయటమేకాక, వాటిని నిత్యమూ పద్యాలను చేర్చుతూ మరింత పెంపు చేస్తున్నారు. అలానే సాహితీ విహారానికై మరిన్ని బ్లాగులనుకుడా తయారు చేయాలనీ , చేస్తారనీ నాకోరిక...... ఈ సందర్భములొ "కొర్నెపాటి తాతానమవళ్ళ"కు అభినందనలు.... నమస్కారములు.
ReplyDeleteనమస్కారములు సత్యనారాయణగారూ! ధన్యవాదములు మీ అభినందనలకు. నాప్రయత్నం నిరంతరము చిరంతరము కొనసాగిస్తాను............
Delete